పిల్లలు తెలుగు మాట్లాడేలా ప్రోత్సహించాలి : త్రిపుర గరవ్నర్​ ఇంద్రసేనారెడ్డి

పిల్లలు తెలుగు మాట్లాడేలా ప్రోత్సహించాలి : త్రిపుర గరవ్నర్​ ఇంద్రసేనారెడ్డి
  • ఘనంగా తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం

గండిపేట్, వెలుగు: తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం- నార్సింగిలోని ఓం కన్వెన్షన్ హాల్ లో ఆదివారం ఘనంగా జరిగింది.   తెలుగు సంగమం వ్యవస్థాపకులు,  బీజేపీ  నేత పి.మురళీధర్​ రావు అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్  ఇంద్రసేనారెడ్డి,  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ  తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు మాట్లాడేలా  ప్రొత్సహించాలన్నారు. 

 రాబోయే తరాల కోసం  తెలుగును  నిలబెట్టడానికి, ప్రొత్సహించడం అందరి బాధ్యత అని  మురళీధర్​ రావు అన్నారు.  విశ్వయోగి విశ్వంజీ మహరాజ్,  నటుడు రాజేంద్రప్రసాద్,  సిలికాన్ ఆంధ్రా విశ్వవిద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ కూచిబొట్ల ఆనంద్. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వీ గంగాధర్ శాస్త్రి,   వీవీ లక్ష్మీనారాయణ, ఎంపీ కొండా ‌‌శ్వర్​రెడ్డి,   ఎంపీ రఘునందన్​రావు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. సాంప్రదాయ నృత్యాలు, శ్రావ్యమైన పాటలు, సాహిత్య చర్చలు ఆకట్టుకున్నాయి.