తెలుగును ప్రథమ భాషగా బోధించాలి

తెలుగును ప్రథమ భాషగా బోధించాలి

జూబ్లీహిల్స్, వెలుగు: తెలుగును ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రథమ భాషగా బోధించాలని వక్తలు కోరారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆదివారం ఆచార్య చింతకింది కాశీం ఆధ్వర్యంలో తెలుగు భాషా పరిరక్షణ రౌండ్​టేబుల్​సమావేశం నిర్వహించారు. మన భాష–మన హక్కు అనే అంశంపై ఎమ్మెల్సీ ప్రొఫెసర్​కోదండరాం, డాక్టర్​నందిని సిదారెడ్డి,  ప్రొఫెసర్​ గారపాటి ఉమామహేశ్వరరావు, ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి, ప్రొఫెసర్ బన్న ఐలయ్య, ప్రొఫెసర్ సిల్మానాయక్, ప్రొఫెసర్ లావణ్య, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ పసునూరి రవీందర్ మాట్లాడారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్​కళాశాలల్లో సంస్కృతం పరీక్షను దేవనాగరి లిపిలోనే రాసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.