- విత్తనాల ఉత్పత్తి, సరఫరాపై చర్చ
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల సీడ్స్ చైర్మన్లు విజయవాడలో సమావేశమయ్యారు. తెలంగాణ సీడ్స్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఏపీ సీడ్స్ చైర్మన్ మన్నె సుబ్బా రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీ రావు భేటీ అయ్యారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఉభయ రాష్ట్రాలకు అవసరమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరాలపై చర్చించారు.
ఉద్యోగులకు సంబంధించిన భవిష్య నిధి సమాచారం నెల రోజుల్లో తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ అధికారులు అంగీకరించారు. పెండింగ్ లో ఉన్న షేర్స్ డీమెర్జర్ అంశంపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ సీడ్స్ ప్రొడక్షన్, మార్కెటింగ్ మేనేజర్లు, ఏపీ సీడ్స్ ప్రొడక్షన్, మార్కెటింగ్, ఫైనాన్స్ మేనేజర్లు పాల్గొన్నారు.