పుట్టినరోజు నాడే.. మృత్యు ఒడిలోకి.. ఫిలిప్పీన్స్ లో తెలుగు విద్యార్థిని అనుమానాస్పద మృతి..

విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని పుట్టినరోజు నాడే మృత్యు ఒడిలోకి చేరుకుంది.. పటాన్ చెరు మండలం ఇంద్రేషం కి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని స్నిగ్ధ ఫిలిప్పీన్స్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శుక్రవారం ( నవంబర్ 15, 2024 ) చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పటాన్ చెరు మండలం ఇంద్రేషం గ్రామానికి చెందిన స్నిగ్ధ  ఫిలిప్పీన్స్ లోని పర్ఫెచువల్ హెల్ప్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. పుట్టినరోజు నాడు తమ కూతురికి విషెస్ చెబుదామనుకున్న తల్లిదండ్రులకు శుక్రవారం ( నవంబర్ 15, 2024 ) నాడు షాకింగ్ న్యూస్ తెలిసింది. స్నిగ్ధ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందంటూ వచ్చిన వార్తతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

పుట్టినరోజు నాడే తమ బిడ్డ మృత్యు ఒడిలో చేరిందన్న వార్తతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనతో  స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. స్నిగ్ధది సహజ మరణమేనా లేక ఆమె మృతికి ఇంకేమైనా కారణాలున్నాయా అన్నది తెలియాల్సి ఉంది.