ఖమ్మం రూరల్, వెలుగు: మార్కులు తక్కువ వచ్చాయని ఖమ్మంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌టీచర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్లను చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరుమలాయపాలెం మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో టెన్త్చదువుతున్న ఏడుగురికి మార్కులు తగ్గాయని తెలుగు టీచర్లక్ష్మణ్ కర్రతో చితకబాదాడు. వీపులు కందిపోయేలా కొట్టాడు. తట్టుకోలేకపోయిన చిన్నారులు వెంటనే తల్లిదండ్రులకు ఫోన్‌చేసి ‘మేం బతకలేం.. చచ్చిపోతాం’ అంటూ బాధపడ్డారు.
తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. హైవే మీద రాస్తారోకో చేపట్టారు. పిల్లలను కొట్టిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కులు తగ్గితే ఇలా కొట్టాలా అని ప్రశ్నించారు. స్థానిక ఎస్సై గిరిధర్ రెడ్డి తమ సిబ్బంది అక్కడికి చేరుకుని తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ పుల్లారావుతో మాట్లాడారు. ఆందోళన విరమింపజేశారు.