పుణె : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ కీలక విజయంతో ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. శనివారం లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 36–-32తో గుజరాత్ జెయింట్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన కెప్టెన్ పవన్ సెహ్రావత్ (12 పాయింట్లు) సూపర్ టెన్‌తో సత్తా చాటగా.. విజయ్ మాలిక్ (8 పాయింట్లు), ఆశీష్ నర్వాల్(6) ఆకట్టుకున్నారు.
గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ (10 పాయింట్లు), గుమన్ సింగ్ (9) రాణించారు. 20 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించిన టైటాన్స్ ఐదో స్థానానికి చేరుకుంది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 37–44తో దబాంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది.