గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్11వ సీజన్లో తెలుగు టైటాన్స్ ఆరో విజయాన్ని నమోదు చేసింది. రైడింగ్‌లో ఆశీష్ నర్వాల్ (11), విజయ్ మాలిక్ (8) రాణించడంతో.. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 49–27తో హర్యానా స్టీలర్స్‌కు చెక్ పెట్టింది. శంకర్ (5), సాగర్ (5), అంకిత్ (5) కూడా టైటాన్స్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. హర్యానా తరఫున రాహుల్ (6), మహ్మద్రెజా (6), వినయ్ (3) ఓ మాదిరిగా ఆడారు.
తాజా విజయంతో టైటాన్స్ 32 పాయింట్లతో ఏడో ప్లేస్‌లోకి రాగా, హర్యానా 41 పాయింట్లతో టాప్ ప్లేస్లోనే కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో యు ముంబా 38–37తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. ముంబా తరఫున అజిత్ చౌహాన్ (10)కు మంజిత్ (9) రాణించారు. బుల్స్ లెఫ్ట్ రైడర్ నర్వాల్ (10), సుశీల్ (6), నితిన్ (6) కీలక పాయింట్లు సాధించినా ప్రయోజనం దక్కలేదు. 34 పాయింట్లతో యు ముంబా నాలుగో ప్లేస్‌లో ఉండగా, 13 పాయింట్లతో బెంగళూరు బుల్స్ జట్టు 11వ ప్లేస్‌కు పడిపోయింది.