ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌ తొమ్మిదో సీజన్‌‌‌‌లో రెండోసారి ఓడిన తెలుగు టైటాన్స్‌‌‌‌

ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌ తొమ్మిదో సీజన్‌‌‌‌లో రెండోసారి ఓడిన తెలుగు టైటాన్స్‌‌‌‌

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌ తొమ్మిదో సీజన్‌‌‌‌లో తెలుగు టైటాన్స్‌‌‌‌ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో టైటాన్స్‌‌‌‌  25–45 తేడాతో బెంగాల్‌‌‌‌ వారియర్స్‌‌‌‌ చేతిలో చిత్తయింది. బెంగాల్‌‌‌‌కు టైటాన్స్‌‌‌‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. కెప్టెన్ మణిందర్‌‌‌‌ సింగ్‌‌‌‌ (11 పాయింట్లు), దీపక్‌‌‌‌ హుడా (11) వారియర్స్‌‌‌‌కు ఘన విజయం కట్టబెట్టారు.

టైటాన్స్‌‌‌‌ జట్టులో  రైడర్లు వినయ్‌‌‌‌ (8), మోను గోయత్‌‌‌‌ (7) ఆక్టటుకున్నారు.  అంతకుముందు మ్యాచ్‌‌‌‌లో బెంగళూరు బుల్స్‌‌‌‌ 41–39తో పుణెరి పల్టాన్‌‌‌‌ను ఓడించి లీగ్‌‌‌‌లో రెండో విజయం సొంతం చేసుకుంది. మూడో పోరులో జైపూర్‌‌‌‌ పింక్‌‌‌‌ పాంథర్స్‌‌‌‌ 35–30తో పాట్నా పైరేట్స్‌‌‌‌పై గెలిచింది.