
హైదరాబాద్, వెలుగు: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్.. నాలుగు వరుస విజయాలతో రెండో ప్లేస్‌కు దూసుకొచ్చింది. శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 34–33తో పుణెరి పల్టాన్‌పై గెలిచింది. దాంతో హైదరాబాద్ అంచెను విజయంతో ముగించింది. టైటాన్స్ రైడర్లు పవన్ సెహ్రావత్ (12), విజయ్ మాలిక్ (13) సూపర్ షో చూపెట్టారు. ఈ ఇద్దరు కలిసి 25 పాయింట్లు సాధించారు. పుణెరి టీమ్‌లో పంకజ్ (9), మోహిత్ గోయత్ (5) పోరాడారు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 40–29తో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. బెంగాల్ ప్లేయర్లు నితిన్ (10), మోహిందర్ (14) రాణించారు. బెంగళూరు జట్టులో అక్షిత్ (11) ప్రతిఘటించాడు.
Looping the Winning 🫡
— Telugu Titans (@Telugu_Titans) November 9, 2024
4 in a Row!#TTvPUN #TeluguTitans #PuneriPaltan #PKLSeason11 #BattleOfBreath #LetsKabaddi #ProKabaddi #PKL11 #ProKabaddiLeague #TeluguTitansTeam #TitansArmy pic.twitter.com/7hxwEDI7Rr