పుణె : ప్రొ కబడ్డీ లీగ్11వ సీజన్లో తెలుగు టైటాన్స్ తమ చివరి లీగ్ దశ పోరులో ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో తెలుగు జట్టు 48–36 స్కోరుతో పుణెరి పల్టాన్ జట్టును చిత్తు చేసింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ (15 పాయింట్లు) , ఆశీష్ నర్వాల్ (11) సూపర్ టెన్స్తో సత్తా చాటగా.. డిఫెండర్ అంకిత్ (6) రాణించాడు. పుణెరి జట్టులో అజిత్ (10), ఆర్యవర్దన్ నవాలె (8) పోరాడారు.
మొత్తం 22 మ్యాచ్లు ఆడిన టైటాన్స్ 12 విజయాలు, 10 ఓటములతో 66 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. మరో రెండు మ్యాచ్లు మిగిలున్న యు ముంబా కూడా 66 పాయింట్లతో ఆరో ప్లేస్లో ఉంది. ఇంకో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 31–28తో బెంగాల్ వారియర్స్పై గెలిచి ప్లేఆఫ్స్ చేరింది.