ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌ 11వ సీజన్‌‌‌‌‌‌‌‌లో టైటాన్స్‌‌‌‌‌‌‌‌ తీన్‌‌‌‌‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌ 11వ సీజన్‌‌‌‌‌‌‌‌లో టైటాన్స్‌‌‌‌‌‌‌‌ తీన్‌‌‌‌‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌ 11వ సీజన్‌‌‌‌‌‌‌‌లో తెలుగు టైటాన్స్‌‌‌‌‌‌‌‌ మూడో విజయం అందుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో టైటాన్స్  38–35 తేడాతో బెంగళూరు బుల్స్‌‌‌‌‌‌‌‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లతో జట్టును ముందుండి నడిపించాడు. మరో రైడర్ ఆశీష్​ నర్వాల్ ఆరు, ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయ్ మాలిక్, డిఫెండర్ అజిత్ పవార్‌‌‌‌‌‌‌‌ చెరో‌‌‌‌‌‌‌‌ ఐదు పాయింట్లతో ఆకట్టుకున్నారు.

బుల్స్‌‌‌‌‌‌‌‌ తరఫున అజింక్యా పన్వార్ (9), పంకజ్ (9), నితిన్ రావల్ (7) రాణించినా ఫలితం లేకపోయింది. ఆరు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో మూడో విజయంతో  టైటాన్స్ (16 పాయింట్లు) పట్టికలో  పది నుంచి ఐదో స్థానానికి చేరుకుంది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పట్నా పైరేట్స్‌‌‌‌‌‌‌‌ 42-–37తో యూపీ యోధాస్‌‌‌‌‌‌‌‌పై  గెలిచింది.  పట్నా  రైడర్లు దేవాంక్‌‌‌‌‌‌‌‌ (11), అయాన్‌‌‌‌‌‌‌‌ ( 9 పాయింట్లు) సత్తా చాటారు.