హైదరాబాద్, వెలుగు : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు బాట పట్టింది. సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 28-–26తో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ఫస్టాఫ్‌లో వెనుకబడినా బ్రేక్ తర్వాత అద్భుతంగా పుంజుకున్న తెలుగు జట్టు లీగ్‌లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది.
టైటాన్స్ రైడర్లు ఆశీష్ నర్వాల్ (9 పాయింట్లు), పవన్ సెహ్రావత్(5), డిఫెండర్ అంకిత్ (4) రాణించారు. పట్నా తరఫున దేవాంక్(7), అయాన్ (6 ) ఆకట్టుకున్నారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో గత సీజన్ రన్నరప్ హర్యానా స్టీలర్స్ 41–-34తో దబాంగ్ ఢిల్లీ కేసీ జట్టుపై గెలిచింది.