
- అవార్డులను ప్రకటించిన తెలుగు యూనివర్సిటీ
హైదరాబాద్, వెలుగు: తెలుగు యూనివర్సిటీ 2018 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. తెలుగు సాహిత్యంలోని నాట్యం, నాటకం, అవధానం, పత్రికా రచన, జీవిత చర్రిత, మహిళా అభ్యుదయం, గ్రంథాలయం, సంఘసేవ, జానపద కళలు, ఇంద్రజాలం, లలిత సంగీతం, జ్యోతిష్యం, కార్టూన్, గజల్, నిరంతర విద్య తదితర రంగాల్లో సేవలందించిన 44 మందికి అవార్డులను ప్రకటించింది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భట్టు రమేశ్ పురస్కార వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు. తెలుగు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం తెలుగు రాష్ట్రాల్లోని పలువురిని పురస్కారాలకు ఎంపిక చేసింది. జనవరిలో వర్సిటీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో వీటిని ప్రదానం చేయనున్నారు. పురస్కారంతో పాటు రూ.5,116 నగదు అందజేస్తారు.
‘వెలుగు’జర్నలిస్టుకు అవార్డు
వెలుగు పేపర్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్న మరిపాల శ్రీనివాస్ కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, పోరాట యోధుడు – తొలి అమరుడు దొడ్డి కొమురయ్య’పుస్తకానికి ‘జీవిత చరిత్ర’విభాగంలో అవార్డు లభించింది. కొమురయ్య జీవితంపై పరిశోధన చేసి ఆయన రాసిన ఈ పుస్తకాన్ని 2016 జులై 3న బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు.
పురస్కారాలకు ఎంపికైన వారు వీరే..
గంప నాగేశ్వరరావు (వ్యక్తిత్వ వికాసం), రమేశ్ (భాషా చంధస్సు సాహిత్య విమర్శ), మచ్చ హరిదాస్ (సాహిత్య విమర్శ), మెట్టు మురళీధర్ (కథ), తాటికొందాల నరసింహారావు(నాటకరంగం), జానకి (జన రంజక విజ్ఞానం), రామిరెడ్డి(కాల్పనిక సాహిత్యం), పవన్ కుమార్ (ఉత్తమ ఉపాధ్యాయుడు), రాజశుఖ(పత్రికా రచన), మరిపాల శ్రీనివాస్ (జీవిత చరిత్ర), జావేద్ (కార్టూనిస్ట్), ఆర్.కమల(ఉత్తమ రచయిత్రి), పూస లక్ష్మీనారాయణ (వచన కవిత), కోడూరు పుల్లారెడ్డి (సృజనాత్మక సాహిత్యం), శ్రీకాంత్ కుమార్ (పరిశోధన), గురవారెడ్డి (హాస్యరచన), సి.జానకీ బాయి (ఉత్తమ నటి), వల్లూరు శ్రీహరిరావు(ఉత్తమ నటుడు), రావుల పుల్లాచారి(ఉత్తమ నాటక రచయిత), షేక్ బాబు(హేతువాద ప్రచారం), విజయలక్ష్మి పండిట్(ఉత్తమ రచయిత్రి), టి.వి.భాస్కరాచార్య(వివిధ ప్రక్రియలు), పుల్లూరి ప్రభాకర్(అవధానం), సూరేపల్లి సుజాత (మహిళాభ్యుదయం), రవీంద్రాచారి(గ్రంథాలయ కర్త), దొర్తి ఐజాక్ (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), కిరణ్మయి (ఆంధ్రనాట్యం), గులాబీల మల్లారెడ్డి (నవల), గడ్డం శ్రీనివాస్ (జానపద కళలు), ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్(ఆధ్యాత్మిక సాహిత్యం), తిరువాయిపాటి చక్రపాణి(పద్యం), సంజయ్ కిశోర్(సాంస్కృతిక సంస్థ నిర్వహణ), వొల్లాలవాణి(జానపద గాయకులు), వాసరవేణి పరశురాములు(బాల సాహిత్యం), మ్యాజిక్ బోస్(ఇంద్రజాలం), మోత్కూరి మాణిక్యరావు(పద్య రచన), సురేఖా మూర్తి (లలిత సంగీతం), ఇందిరా కామేశ్వరరావు(శాస్త్రీయ సంగీతం), సాగి కమలాకర శర్మ(జోతిష్యం), ప్రొఫెసర్ వెనకపల్లి తిరుపతయ్య(గేయం), సుధీర్ రావు(కూచిపూడి నృత్యం), జయరాములు(ప్రాచీన సాహిత్యం), కృష్ణా నాయక్ చౌహాన్ (అనువాద సాహిత్యం), పి.లక్ష్మీరెడ్డి(చిత్ర లేఖనం).