తెలుగు వర్సిటీ ఇక సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీ..పేరు మారుస్తూ గెజిట్  విడుదల

తెలుగు వర్సిటీ ఇక సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీ..పేరు మారుస్తూ గెజిట్  విడుదల

హైదరాబాద్, వెలుగు: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మారింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం గెజిట్  విడుదల చేసింది. కాగా, తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణకు విశేష కృషిచేసిన సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు వర్సిటీకి పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని వర్సిటీ వీసీ వెలుదండ నిత్యానందరావు, రిజిస్ట్రార్ కోట హనుమంతరావు  అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.