తెలుగు వికీపీడియా పండగ 2025 విజయవంతం

తెలుగు వికీపీడియా పండగ 2025 విజయవంతం

ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో తిరుపతిలో నిర్వహించిన "తెలుగు వికీపీడియా పండగ 2025" ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 50 మందికి పైగా తెలుగు వికీపీడియా సభ్యులు పాల్గొన్నారు. 2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా ఇప్పటివరకు లక్షకు పైగా వ్యాసాలు కలిగి ఉండటం గమనార్హం.

ఈ ఈవెంట్ సందర్భంగా "తెలుగు వికీపీడియాను విస్తరించే మార్గాలు", "సభ్యుల వ్యాస రచనా నైపుణ్యాల మెరుగుదల", "వ్యాసాలను ప్రజలకు మరింత ఆసక్తికరంగా రూపొందించే పద్ధతులు" వంటి పలు అంశాలపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. అదనంగా, "తెలుగు వికీపీడియాలో చేరండి.. అందరికీ విజ్ఞానం పంచండి" అనే నినాదంతో తిరుపతి నగర వీధుల్లో వికీపీడియా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. గత దశాబ్ద కాలంలో తెలుగు వికీపీడియాకు విశేష సేవలు అందించిన వారిని ఈ వేడుకల్లో సత్కరించారు. ఉత్తమ నిర్వాహకునిగా యర్రా రామారావు సత్కారం పొందారు.

ఆన్‌లైన్ తరగతులు..

"తెలుగు వికీపీడియా బడి" పేరుతో త్వరలో ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. కొత్త సభ్యులు వీటి ద్వారా వికీపీడియాలో భాగస్వాములు కావొచ్చు.