
న్యూఢిల్లీ: సింగపూర్‌కు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ టెమాసెక్, ఇండియాలోని అతిపెద్ద స్నాక్స్, స్వీట్స్ తయారీ కంపెనీ హల్దీరామ్‌లో వాటాను కొనుగోలు చేయనుంది. ఇప్పటికే ఉన్న షేర్‌హోల్డర్ల నుంచి వాటాలను కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. డీల్ వివరాలు, ఏ వాల్యుయేషన్ దగ్గర కొనుగోలు పూర్తి చేస్తుందో మాత్రం టెమాసెక్ బయటపెట్టలేదు.
కానీ, డీల్ కుదిరినట్టు హల్దీరామ్ అధికారికంగా ప్రకటించింది. హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్‌లో మైనారిటీ 10 శాతం వాటాను సుమారు రూ. 85,000 కోట్ల
వాల్యుయేషన్ వద్ద టెమాసెక్ కొనుగోలు చేస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇదే నిజమైతే ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఇది అతిపెద్ద డీల్‌గా నిలవనుంది..