హిమాచల్ ప్రదేశ్: న్యూజిలాండ్ టూర్ కు దూరమైన కొందరు భారత ప్లేయర్లు సౌతాఫ్రికా వన్డేలో ఆడనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సిరీస్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా గట్టి ప్రాక్టీస్ చేస్తుంది. ముఖ్యంగా టీమ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముగ్గురిపైనే అందరి దృష్టి పడింది. ధర్మశాల వేదికగా గురువారం సౌతాఫ్రికాతో ఫస్ట్ వన్డే జరగనుండగా..ఈ మ్యాచ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, బౌలర్ భువనేశ్వర్ ఆడనున్నారు.
అయితే గాయాల కారణంగా ఈ ప్లేయర్లు కొద్ది రోజులు పాటు క్రికెట్ కు దూరమయ్యారు. దీంతో ఈ సిరీస్ లో వీరి ఆట తీరుపై టీమిండియా మేనేజ్ మెంట్ తో పాటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే న్యూజిలాండ్ తో వన్డే, టెస్ట్ సిరీస్ లలో విఫలమైన భారత్ కు.. వీరి రూపంలోనైనా తిరిగి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నారు.
దీంతో శిఖర్ ధావన్, హార్థిక్ పాండ్యా, ర్ భువనేశ్వర్ లకు ఈ సిరీస్ అగ్ని పరీక్షగా మరనుందంటున్నారు స్పోర్ట్స్ విశ్లేషకులు. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ధర్మశాల చేరుకున్న టీమిండియా.. మంగళవారం నుంచే ప్రాక్టీస్ షురూ చేసింది. మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభం కానుంది.