లంబసింగిలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత

లంబసింగిలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రత

ఆంధ్రా కాశ్మీర్ గా పిలుచుకునే లంబసింగిలో ఉష్ణోగ్రలు భారీగా పడిపోయాయి. చలి విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. చింతపల్లిలోనూ ఉష్ణోగ్రత 2డిగ్రీలుగా ఉంది. పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో ఎటు చూసినా మంచు కనిపిస్తోంది.

టెంపరేచర్ దారుణంగా పడిపోవడంతో మన్యంవాసులు ఎముకలు కొరికే చలిలో గజగజ వణికిపోతున్నారు. సూర్యుడు వచ్చే వరకు ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. చలికి తట్టుకోలేక పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. స్వెటర్లు, గ్లౌజులు, సాక్సులు వేసుకోవడంతో పాటు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు.