మార్చిలో ఎండలు మరింత పెరిగే అవకాశం 

మార్చిలో ఎండలు మరింత పెరిగే అవకాశం 
  • సీజన్​కు ముందే రికార్డు టెంపరేచర్లు
  • హైదరాబాద్​లో 37 డిగ్రీలకు పైగా నమోదు 
  • ఐదేండ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండుతున్నయ్. సీజన్ కు ముందే సుర్రుమంటున్నయ్. ముఖ్యంగా హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. పోయినేడాది ఫిబ్రవరిలో 34 డిగ్రీల లోపే టెంపరేచర్లు నమోదు కాగా, ఈసారి ఇప్పటికే 37 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఈ నెల 21న కూకట్ పల్లిలో 36.3, 22న బోరబండలో 37.3, 23న షేక్‌‌పేట్‌‌లో 37.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది.

ఎండలు సుర్రుమంటున్నయ్

రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరుగుతా యని, 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్​ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడ్రోజుల్లో అత్యధికంగా 33 నుంచి 38 డిగ్రీలు, అత్యల్పంగా 18 నుంచి 21 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. 

2017 తర్వాత... 

సిటీలో 2017 ఫిబ్రవరిలో అత్యధిక టెంపరేచ ర్లు నమోదయ్యాయని.. మళ్లీ ఆ స్థాయిలో ఇ ప్పుడే నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ ఏడాది ఫిబ్రవరి 21న 37.8, 22న 37.5, 24న 37.7 డి గ్రీల చొప్పున ఉప్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. అంతకుముందు 2016 ఫిబ్రవరి 22న 38.2, 23న 38.7, 24న 38.2 డిగ్రీ ల చొప్పున రికార్డయ్యాయని పేర్కొంది.

నెలాఖరు వరకు ఇట్లనే...  

ఫిబ్రవరిలో ఎండలకు ఇదొక ఫేజ్. ఈ నెలాఖ రు వరకు ఇట్లనే ఉంటది. అత్యధికంగా 39 డిగ్రీల దాకా నమోదవుతాయి. నిజానికి ఎండ ల సీజన్ మార్చిలో మొదలవుతుంది. మొదటి వారంలో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ, రెండో వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుంది. - నాగరత్న, డైరెక్టర్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం