తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెల ముగియకముందే రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ ఎండలు గట్టిగా కొడుతున్నాయి. 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పగలు హైదరాబాద్ నగరం హీటెక్కుతోంది. ఉదయం, సాయంత్రం వేళలో మాత్రం ఉష్ణోగ్రతలు తగ్గి చల్లని వాతావరణం ఉంటోంది.
ALSO READ :- ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? క్రోమ్ బ్రౌజర్ తో తస్మాత్ జాగ్రత్త..!
అయితే, వేసవి కాలం ప్రారంభం కానుండడంతో ఇక నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని.. పలు జిల్లాలతోపాటు హైదరాబాద్ లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని మెట్రోలాజికల్ డిపార్మెంట్ వెల్లడించింది. ఈసారి నగరంలో ఎండల తీవ్రత పెరగనుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.