- పెరుగుతున్న వడదెబ్బ మరణాలు
- ఈ నెలలో 15 మందికి పైగా మృతి
వెలుగు, నెట్ వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 వరకు హైదరాబాద్ సహా పట్టణాలు, గ్రామాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
ఉపాధి హామీ కూలీలు, ఫీల్డ్వర్కర్లు, పశువుల కాపరులు మండే ఎండల్లో పని చేయడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈజీఎస్ పనులు చేస్తున్న దగ్గర నీడ, నీళ్ల ఏర్పాట్లు చేయకపోవడంతో ఉపాధి కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. ఏప్రిల్‌లో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా15 మందికి పైగా వడదెబ్బతో చనిపోయారు. మంగళవారం కూడా రాష్ట్రమంతటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 45 డిగ్రీలు రికార్డు కాగా, నిజామాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌లలో 44 డిగ్రీలు, నిర్మల్ జిల్లా కడెంలో 43, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్‌లో, భద్రాద్రి జిల్లా మణుగూరులో 42 డిగ్రీలు, కొత్తగూడెంలో 41, నల్గొండలో కూడా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
వడదెబ్బతో..
వడదెబ్బతో ఈ సీజన్లో ఇప్పటివరకు 15 మందికి పైగా చనిపోయారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మృతి చెందారు. మంచిర్యాల జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్‌లో ఇద్దరు, యాదాద్రి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో ఉపాధి హామీ పధకం టెక్నికల్అసిస్టెంట్ సంపత్ ఫీల్డ్విజిట్చేసి ఇంటికి వెళ్లగానే అస్వస్థతకు గురై చనిపోయాడు. నిర్మల్ జిల్లా లోని దిలావర్పూర్ మండలం బన్సపల్లికి చెందిన ఉపాధి కూలీ పుండ్రు వనిత ఈనెల 18న చనిపోయింది. నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లికి చెందిన రాముడు(35) ఈనెల 18న గొర్రెలు మేపడానికి వెళ్లి ఎండల వల్ల అస్వస్థతకు గురై మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపూర్ లో ఉపాధి కూలీ మాదారపు సోమయ్య ఈ నెల 14న వడదెబ్బతో మరణించాడు. ఈజీఎస్ పనులు జరుగుతున్న చోట నిబంధనల ప్రకారం నీడ, నీ