బేల @ 7 డిగ్రీలు.. రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు

 బేల @ 7 డిగ్రీలు.. రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు
  • రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు
  • ఏడు జిల్లాలకు రెడ్‌‌ అలర్ట్‌‌ జారీ

ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి ఆదిలాపాద్‌‌ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదిలాబాద్‌‌ జిల్లా బేల మండల కేంద్రంలో గురువారం రాష్ట్రంలోనే కనిష్టంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌‌లోని సిర్పూర్‌‌ (యూ) లో 7.03,పెంబిలో 8.3 డిగ్రీలు నమోదైంది. 

మరో వైపు మెదక్‌‌ జిల్లా శివంపేటలో 9.4, సంగారెడ్డి జిల్లా కోహిర్‌‌లో 9.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌‌లో 9.7, వికారాబాద్ జిల్లాలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌‌ అలర్ట్‌‌ జారీ చేసింది. రాత్రి 8.30 గంటల నుంచి ఉదయం 8.30 గంటలకు చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.