రాష్ట్రంలో భానుడు భగభగమండుతున్నాడు. మార్చి నెల పూర్తికాకముందే ఎండలు మండుతున్నాయి. దాంతో బయటకు వెళ్లాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. తప్పని సరి అయితే తప్ప బయటకు రావొద్దని జనాలు అనుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా తానూర్‌లో 42.5 డిగ్రీలు, వడ్యాల్లో 42.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అదేవిధంగా ఆదిలాబాద్ లో 42.1 డిగ్రీలు, జైనథ్ లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
For More News..