న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో హీట్ వేవ్స్‌పై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. జనం హీట్ స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతోంది. గత సోమవారం ఒడిశాలో ని బరిపాదలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పింది. చాలా ఏరియాల్లో సాధారణంతో పోలిస్తే 5 డిగ్రీలు ఎక్కువగా టెంపరేచర్లు నమోదయ్యాయని, హర్యానా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశాలో తదితర ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పింది.
హీట్ స్ట్రోక్స్‌తో ఇప్పటిదాకా 13 మంది చనిపోయారు. దీంతో వైద్య అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. హైడ్రేట్‌గా ఉండాలని, కాటన్ క్లాత్‌లు ఉపయోగించాలని, అవసరమైతేనే బయటికి వెళ్లాలని చెబుతున్నారు. వడగాడ్పుల నేపథ్యంలో ఇప్పటికే వెస్ట్ బెంగాల్‌లో వారం రోజులపాటు స్కూళ్లను మూసేసిన విషయం తెలిసిందే!