ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా సోమవారం నిర్మల్ జిల్లాలోని అక్కాపూర్ లో 41.1 డిగ్రీలు నమోదైంది. ఆసిఫాబాద్ లో 40.9, బేల మండలంలోని చప్రాలలో 40.8, ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 40.7, నిర్మల్ జిల్లా దస్తురాబాద్, నర్సాపూర్ జి లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత పెరిగిపోతుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి.