పెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి : నర్సయ్యయాదవ్

పెద్దగట్టు జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలి : నర్సయ్యయాదవ్

నల్గొండ అర్బన్, వెలుగు : గొల్లగట్టు(పెద్దగట్టు) జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని, జాతర నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయించాలని లింగమంతులస్వామి ఆలయ చైర్మన్ నర్సయ్యయాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం నల్గొండలోని యాదవ సంఘం భవన్ లో జాతరకు సంబంధించిన వాల్​పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. లింగమంతులస్వామి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు.

 ఈనెల 16 నుంచి 20 వరకు జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకుడు ఎల్.గోవర్ధన్, నాయకులు ఎస్.సుధాకర్ యాదవ్, ఎల్బీ యాదవ్, జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్  పాల్గొన్నారు.