షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని జానంపేట బసవన్న దేవాలయంలో అతి పురాతన శివలింగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అక్కడున్న వినాయక విగ్రహాన్ని చెట్ల పొదల్లో పడేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు శుక్రవారం దేవాలయం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.