పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద హైడ్రామా .. కమిటీలో స్థానం కోసం పట్టుబట్టిన గ్రామస్తులు

పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద హైడ్రామా .. కమిటీలో స్థానం కోసం పట్టుబట్టిన గ్రామస్తులు

పాల్వంచ, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ప్రసిద్ధి చెందిన పెద్దమ్మతల్లి ఆలయ కమిటీలో తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ కేశవాపురం, జగన్నాధపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బుధవారం కొత్త కమిటీ సభ్యులతో ఆలయ ఈవో రజనికుమారి సమావేశం ఏర్పాటు చేశారు.

 ప్రమాణ స్వీకారోత్సవంపై చర్చిస్తుండగా, స్థానికులు ఆలయానికి చేరుకొని అర్దనగ్న ప్రదర్శన చేశారు. ఇద్దరు వ్యక్తులు వాటర్  ట్యాంక్  ఎక్కి నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పాల్వంచ పోలీసులు ఆలయానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.