- దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించిన గుట్ట టెంపుల్ ఈవో గీతారెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు: ఈ నెల 23న ‘వైకుంఠ ఏకాదశి’ సందర్భంగా యాదగిరిగుట్టకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను యాదగిరిగుట్ట టెంపుల్ ఈవో గీతారెడ్డి ఆహ్వానించారు.
ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ సెక్రటేరియట్ లో మంత్రి కొండా సురేఖను ఈవో గీతారెడ్డి కలిసి నారసింహుడి ఫొటోను బహుకరించారు. వైకుంఠ ఏకాదశికి రావాలని ఆహ్వానించారు. అనంతరం యాదగిరిగుట్ట లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.