మందమర్రి మండలంలో గుప్త నిధుల కోసం గుడి ఆవరణలో తవ్వకాలు

కోల్​బెల్ట్, వెలుగు : మందమర్రి మండలం పొన్నారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి, నాగదేవత విగ్రహాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు.  సోమవారం నాగుల పంచమి సందర్భంగా గ్రామ మహిళలు పుట్టలో పాలు పోసేందుకు దేవాలయం ఆవరణలోకి వెళ్లగా సుమారు నాలుగు మీటర్లు లోతు, 12 మీటర్ల వెడల్పుతో  పుట్టను తవ్వినట్లు మహిళలు, గ్రామస్తులు గుర్తించారు.

వందేళ్ల చరిత్ర కలిగిన ఆలయానికి కార్తీక మాసం, అమావ్యాస పర్వదినాల్లో భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. ఈ ఘటనతో భక్తులు ఒకింత భయాందోనళకు గురయ్యారు. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు దొండ సంపత్​, గ్రామస్తులు కోరారు.