కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో వీరశైవ పూర్వ సాంప్రదాయం ప్రకారం దేవి త్రిరాత్రి ఉత్సవాలను ఆలయ అర్చకులు బుధవారం ప్రారంభించారు. కొమురవెల్లిలోని దేవి త్రిరాత్రి ఉత్సవాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు, దేవాలయ ప్రధాన అర్చకులు ఎం. మల్లికార్జున్, స్థానాచార్య పి. మల్లయ్య పూజలు చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్, ఎలక్ట్రికల్ ఏఈ భాస్కర్ రావు, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఎస్సై లింగంపల్లి రాజుగౌడ్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.