ఆలయంలో చోరీ.. గంటలో నిందితుల అరెస్ట్

హబీబ్ నగర్ పోలీసులు నాంపల్లి పోలీసులతో కలిసి మే 25వ తేదీ గురువారం ఓ ఆలయంలో చోరీ చేసిన దొంగను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వికారాబాద్ జిల్లా ఉమ్లా నాయక్ తండాకు చెందిన సునీల్ చవాన్ అనే వ్యక్తి శ్రీ కట్టమైసమ్మ దేవాలయం తాళం పగులగొట్టి హుండీలో ఉన్న రూ.36,150 నగదు, 70 గ్రాముల వెండి ఆభరణాలు దొంగిలించాడు. సమాచారం అందుకున్న హబీబ్ నగర్, నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించి నేరం జరిగిన గంటలోపే పట్టుకున్నారు.

"అలర్ట్ స్టాఫ్ సకాలంలో చర్య తీసుకోవడంతో తాము చాలా తక్కువ సమయంలో నిందితుడిని గుర్తించగలిగామని.. ఈ ప్రాంతంలో మతపరమైన కల్లోలం నివారించగలిగామని హబీబ్ నగర్ ఎస్ఐ సైదాబాబు తెలిపారు.