ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి సందడి

 వెలుగు, న్యూస్​ నెట్​వర్క్​ : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 4 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభించడంతో వేల సంఖ్యలో భక్తులు దర్శనాలు చేసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు భక్తుల రద్దీ నెలకొంది.  పలు వేంకటేశ్వర ఆలయాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. పలు ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తడంతో చుట్టు పక్కల రోడ్లు సందడిగా మారాయి. దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  