అమీన్పూర్లో తొలి వైకుంఠ ఏకాదశి..భీరంగూడ వేంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

సంగారెడ్డి జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తొలి ఏకాదశి కావడంతో భారీగా భక్తులు తరలిస్తున్నారు. విష్ణునామ స్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారు జామునుంచే వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. 

సంగారెడ్డి జిల్లా  అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలిసన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి కావడంతో వైకుంఠ దక్షణి ద్వార దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్వాహకులు క్యూలైన్ల ఏర్పాటు, మంచినీటి వసతి వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు.