హైదరాబాద్, వెలుగు: గణేష్ మండపాలకు టెంపర్‌వరీ పవర్ కనెక్షన్స్ ఇస్తున్నట్టు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మంగళవారం తెలిపింది. సెప్టెంబరు 2 నుంచి 12వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించనున్న మండపాలకు తాత్కాలిక ఎల్‌టీ కనెక్షన్ ఇవ్వనున్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం మండప నిర్వాహకులు నిర్ణయించిన ఫీజు చెల్లించాలి. అనుమతి లేకుండా కొండీలు తగిలించొద్దని టీఎస్‌ఎస్ పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి నిర్వాహకులకు సూచించారు.
మీటర్ అవసరం లేకుండా టారిఫ్
- 250 వాట్స్ వాడకానికి రూ. 500
- 250 -నుంచి 500 వాట్స్ వాడకానికి రూ. 1,000
- 500 నుంచి 1,000 వాట్స్ వాడకానికి రూ.1,500
- ఆపైన వినియోగించే ప్రతి 500 వాట్స్‌కు రూ. 750
- మీటర్ తీసుకునే వారికి యూనిట్‌కు రూ.11, కిలోవాట్‌కు రూ.21