ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా గ్యాలరీ కూలిపోవడంతో 200 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలో జరిగింది. మలప్పురం లో శనివారం ఫుట్ బాల్ పోటీలు నిర్వహించారు. పోటీలను చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం తాత్కాలిక గ్యాలరీ ఏర్పాటు చేశారు. జనం ఎక్కువ కావటంతో గ్యాలరీ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. తాత్కాలిక గ్యాలరీ కూలిపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH Temporary gallery collapsed during a football match in Poongod at Malappuram yesterday; Police say around 200 people suffered injuries including five with serious injuries#Kerala pic.twitter.com/MPlTMPFqxV
— ANI (@ANI) March 20, 2022