చార్మినార్​లో మెడికల్​ స్టూడెంట్లకు టెంపరరీ హాస్టల్

చార్మినార్​లో మెడికల్​ స్టూడెంట్లకు టెంపరరీ హాస్టల్
  • కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓల్డ్ సిటీలోని గవర్నమెంట్ నిజామీయా తిబ్బి కాలేజీ, జనరల్ హాస్పిటల్ ను చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జులీఫకర్ అలీతో కలిసి హైదరా బాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం పరిశీలించారు. కొత్త హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 52 కోట్లు మంజూరు చేసిందని, హెరిటేజ్ బిల్డింగ్స్ రినోవేషన్ కోసం రూ.10 కోట్లు, హాస్టల్ నిర్మాణం కోసం మరో రూ.42 కోట్లు కేటాయించిందని తెలిపారు. 

ఓల్డ్ బిల్డింగ్స్ తొలగింపు రూల్స్ ప్రకారమే జరగాలని, అధికారులు, కాంట్రాక్టర్ కు సూచించారు. మెడికల్ స్టూడెంట్స్ కోసం చార్మినార్ ప్రాంతంలో టెంపరరీ హాస్టల్ ఏర్పాటు చేయాలని, ఫలక్ నుమా ప్రాంతంలో పర్మినెంట్ హాస్టల్ నిర్మాణం కోసం నివేదికలు అందచేయాలన్నారు. హాస్పిటల్ లోని వార్డులను పరిశీలించి, పేషెంట్లతో మాట్లాడారు. డాక్టర్లు, సిబ్బంది కొరత ఉందని ప్రిన్సిపాల్ చెప్పగా, రిపోర్ట్​ఇవ్వాలన్నారు. 

కాలేజీ ప్రిన్సిపాల్ శైజాదీ సుల్తానా, సూపరింటెండెంట్ వసంతరావు, ప్రెసిడెంట్ యూఎంఓఏ డాక్టర్.హైదర్ యమని, కార్పొరేటర్ సోయబ్ ఖాద్రి, తహసీల్దార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.