
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో పలు ఫ్లాట్ ఫామ్స్ మూసివేశారు. దీంతో పలు రైళ్లను ఇతర రైల్వేస్టేషన్ కు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి టెర్మినల్ కు తాత్కాలికంగా మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది.
చర్లపల్లి టెర్మినల్ నుంచి బయల్దేరనున్న ట్రైన్లు ఇవే..
- సికింద్రాబాద్ - అగర్తల (ఏప్రిల్ 28 నుంచి)
- అగర్తల - సికింద్రాబాద్ (మే 2 నుంచి)
- సికింద్రాబాద్ - ముజఫర్పూర్ (మే 1 నుంచి )
- ముజఫర్పూర్ - సికింద్రాబాద్ (ఏప్రిల్ 29 నుంచి )
- సికింద్రాబాద్ - సాంత్రాగచి (ఏప్రిల్ 29 నుంచి)
- సంత్రాగచి - సికింద్రాబాద్ (ఏప్రిల్ 30 నుంచి)
- సికింద్రాబాద్ - దానపూర్ (ఏప్రిల్ 26 నుంచి)
- దనాపూర్ - సికింద్రాబాద్ (ఏప్రిల్ 28 నుంచి)
- హైదరాబాద్ - రక్సౌల్ (ఏప్రిల్ 26 నుంచి)
- రక్సౌల్ - హైదరాబాద్ (ఏప్రిల్ 29 నుంచి) చర్లపల్లి టెర్మినల్ నుంచి బయల్దేరతాయి.