అమ్మకు 75వ బర్త్​డే.. గిఫ్ట్​గా పదిన్నర తులాల గోల్డ్

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బాలికల హైస్కూల్ హెచ్ఎం విజయరావు తన తల్లి 75వ పుట్టిన రోజును కరీంనగర్​ సిటీలోని ఓ ఫంక్షన్​ హాల్​లో ఘనంగా నిర్వహించారు. చుట్టాలను పిలిచి వింధు భోజనం పెట్టాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటకు చెందిన విజయరావు పుట్టిన ఆరు నెలలకే తండ్రి ప్రకాశ్​రావు చనిపోయాడు. 

తల్లి మిరియామ్ ఏ మాత్రం కుంగిపోకుండా కూలి, నాలి చేసి విజయరావును పెంచి పెద్ద చేసింది. ఉన్నత చదువులు చదివించింది. అమ్మకు జీవితాంతం గుర్తుండిపోయేలా  విజయరావు సోమవారం కరీంనగర్ లో ఆమె బర్త్​డేను నిర్వహించాడు. పదిన్నర తులాల బంగారు ఆభరణాలు గిఫ్ట్ గా ఇచ్చాడు.