ఒక టీంలో సాధారణంగా 7 లేదా 8 ఎంతమంది బ్యాటర్లుంటారు. కానీ ఆస్ట్రేలియా జట్టులో మాత్రం ఏకంగా 10 మంది బ్యాటర్లున్నారు. భారత్ తో ప్రస్తుతం మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ బ్యాటింగ్ డెప్త్ చూస్తే వామ్మో అనాల్సిందే. వీరిలో కొంతమంది స్పెషలిస్ట్ బ్యాటర్లుంటే మరికొందరు ఆల్ రౌండర్లున్నారు. మరి కమ్మిన్స్ సేన ఇలా బ్యాటింగ్ కి ఎందుకు ప్రాధాన్యం ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.
ప్రాక్టీస్ కోసమేనా.. ?
వచ్చే నెలలో భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ కి భారత్ పై గెలవడం ఎంత ముఖ్యమో జట్టులో యంగ్ ప్లేయర్లను పరీక్షించుకోవడం అంతే ముఖ్యం. తుది జట్టులో జంపా ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కనబడుతున్నా షార్ట్, లబుషేన్ కూడా స్పిన్ వేయగలరు. ప్రధాన పేసర్లుగా కమ్మిన్స్, అబాట్ ఉన్నా.. గ్రీన్, స్టోయినీస్, మిచెల్ మార్ష్ ఫాస్ట్ బౌలింగ్ ఆలిరౌండర్లే. దీంతో ఓ వైపు బ్యాటింగ్ లో మరోవైపు బౌలింగ్ లో ఆసీస్ జట్టుకి చాలా వనరులు ఉన్నాయి.
బహుశా భారత్ ని బోల్తా కొట్టించాడానికి కమ్మిన్స్ ఈ ప్లాన్ తోనే వచ్చి ఉంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 10 మంది బ్యాటర్లతో పాటు 8 మంది బౌలింగ్ చేయగలరు. అటు జట్టు సమతూకంగా ఉండంతో పాటు కెప్టెన్ కి కూడా భరోసా ఉంటుంది.
నిలకడగా ఆసీస్ ఇన్నింగ్స్
ఇక ఈ మ్యాచులో షమీ తొలి ఓవర్లోనే మార్ష్ వికెట్ తీసి భారత్ కి శుభారంభం ఇచ్చినా.. స్మిత్, వార్నర్ జోడీ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది. రెండో వికెట్ కి వీరిద్దరూ 94 పరుగులు జోడించిన తర్వాత 52 పరుగులు చేసిన వార్నర్.. జడేజా బౌలింగ్ లో ఔటయ్యాడు . ప్రస్తుతం 19 ఓవర్లలో ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. స్మిత్(38), లబుషేన్(2) క్రీజ్ లో ఉన్నారు.