- లోక్ సభ అభ్యర్థులను ఫైనల్ చేసిన పీఈసీ
- ఏడు స్థానాలు పెండింగ్ లో పెట్టిన కాంగ్రెస్
- వీటిని తేల్చేందుకు మరో మారు భేటీ
- చేవెళ్ల బరిలో సునీతా మహేందర్ రెడ్డి?
- సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్!
- పెద్దపల్లి బరిలో గడ్డం వంశీకృష్ణ!
హైదరాబాద్: రాష్ట్రంలో పది లోక్ సభ స్థానాలకు దాదాపు అభ్యర్థులు ఖరారైనట్టు తెలుస్తోంది. మరో ఏడు స్థానాలపై త్వరలో తేల్చే అవకాశం ఉంది. నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రెండు గంటల పాటు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ(పీఈసీ) మీటింగ్ జరిగింది. ఇందులో పది స్థానాల అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతానికి ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి క్యాండిడేట్లను తేల్చలేదని తెలుస్తోంది. వీటిపై మరో మారు పీఈసీ భేటీ జరిగే అవకాశం ఉంది. ఏకాభిప్రాయం కుదిరిన వారి పేర్లను కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి ప పంపింది.
పెండింగ్ లో పెట్టిన స్థానాలు
1.ఖమ్మం,
2.ఆదిలాబాద్,
3.మెదక్,
4.హైదరాబాద్,
5.వరంగల్,
6.నాగర్ కర్నూలు,
7.మల్కాజిగిరి
ఏకాభిప్రాయం కుదిరిన సీట్లు
1 .మహబూబ్ నగర్ వంశీచంద్ రెడ్డి
2. కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి
3. నిజామాబాద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
4. పెద్దపల్లి గడ్డం వంశీ కృష్ణ
5. జహీరాబాద్ సురేష్ శెట్కార్
6. సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్/ బొంతు శ్రీదేవి
7. నల్గొండ కుందూరు జానారెడ్డి / కుందూరు రఘువీర్ రెడ్డి
8. భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి
9. మహబూబాబాద్ బలరాం నాయక్
10. చేవెళ్ల సునీతా మహేందర్ రెడ్డి