యాదాద్రి జిల్లాలో ఒకే రాత్రి పది ఇండ్లలో చోరీ

యాదాద్రి జిల్లాలో ఒకే రాత్రి పది ఇండ్లలో చోరీ

యాదాద్రి (ఆలేరు​), వెలుగు : యాదాద్రి జిల్లాలో దొంగలు హల్​చల్ చేశారు. ఒక్క రాత్రే జ్యూవెలరీ షాప్​సహా పది ఇండ్లలో చొరబడి 2 కిలోల వెండి, రూ. 86 వేల క్యాష్ ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆలేరు మండలం కొల్లూరులో శుక్రవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న జనగాం సత్తిరెడ్డి, వెల్లంకి రవీందర్ రెడ్డి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి రూ.30 వేల క్యాష్​, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. 

ఆలేరు బస్టాండ్ పక్కనే ఉన్న కాశీనాథ జ్యువెల్లరీ షాపులో 1.5 కిలోల వెండి, చిన్న బంగారు ఆభరణాలు, రూ.6 వేల క్యాష్​దొంగిలించారు. మోటకొండూరు మండలం మాటూరులో తాళాలు వేసి ఉన్న ఏడు ఇండ్లలోకి చొరబడి 50 తులాల వెండి, రూ.80 వేల క్యాష్​ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనాలన్నీ అర్ధరాత్రి ఒకే సమయంలో జరగడంతో ఏదైనా గ్యాంగ్ జిల్లాలోకి వచ్చిందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు డాగ్ స్వ్కాడ్​ను రంగంలోకి దింపారు. రెండు టూ వీలర్స్​పై ఆరుగురు వ్యక్తులు తిరిగి దొంగతనాలకు పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.