సోనియా గాంధీని ఆనాడు బలిదేవతన్న రేవంత్ రెడ్డికి.. ఇప్పుడామే ఎట్ల దేవతైందో చెప్పాలని బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ పదవిని రూ. 50కోట్లు పెట్టి కొనుక్కున్నావని సొంత పార్టీ నేతలే రేవంత్ను విమర్శిస్తున్నారని దీనిపై రేవంత్ మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ చేసేది జోడో యాత్ర కాదని ఝాటా యాత్ర అని విమర్శించారు. రేవంత్ నువ్వు రవ్వంత అంటూ మండిపడ్డారు. అనుభవం ఉన్న జీవన్ రెడ్డి కూడా అబద్ధాలు ఆడుతున్నారని రవిశంకర్ చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కొండగట్టును ఏం అభివృద్ధి చేసారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో నిర్వహించే సభకు ఛత్తీస్ఘడ్ సీఎంను తీసుకువస్తున్నారని, ముందుగా తెలంగాణలో అమలయ్యే పథకాలను అక్కడ అమలు చేయాలన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయిన 65 మందికి 10 లక్షల చొప్పున పరిహారం ఇప్పటికే చెల్లించామని రవిశంకర్ చెప్పారు. గాయపడిన మరో వంద మందికి మూడు లక్షల చొప్పున ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు.