పెళ్లికి వెళ్తుండగా ఘోర విషాదం 10మంది సజీవ దహనం

పెళ్లికి వెళ్తుండగా ఘోర విషాదం 10మంది సజీవ దహనం

సంతోషంగా పెళ్లిసందడితో విహహా వేడుకలకు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో పది మంది సజీవ దహనం అయ్యారు. ఈ విషాదకర ఘటన సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ సమీపంలో మార్దా పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. మౌ నుంచి పెళ్లి ఇంటికి బయలుదేరిని బస్సులో మొత్తం 30 మంది ప్రయాణిస్తుండగా వారిలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 

11,000  ఓల్టేజ్ ఉన్న హై టెన్షన్ విద్యుత్ తీగలు బస్సుకు తగిలాయి. వెంటనే బస్సులో మంటలు అంటుకున్నాయి. కరెంట్ షాక్ కు గురవడంతో బస్సులో ఉన్నవారు బయటకు రాలేకపోయారు. ఈ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానికులు కరెంట్ సప్లై ఆపివేసి సహయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించి, చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.