మైనర్ పై లైంగిక దాడికి యత్నించిన యువకుడికి పదేండ్లు జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. వరంగల్ పడమర కోటకు చెందిన మైదం అరుణ్ 2017 జులై 17న అదే ప్రాంతానికి చెందిన బాలిక(13)పై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ టైంలో బాలిక తల్లి అక్కడికి రావడంతో యువకుడు పరారయ్యాడు. ఈ ఘటనపై బాలిక తండ్రి మిల్స్‌కాలనీ పీఎస్‌లో కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఫోర్త్ అడిషనల్ సెషన్స్‌కోర్టు, పోక్సో యాక్ట్ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జి గురువారం నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
For More News..