
హైదరాబాద్, వెలుగు: పప్పుధాన్యాల బ్రాండ్ తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా, ఆసియా వన్ మ్యాగజైన్ నిర్వహించిన 25వ ఏషియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరమ్ కార్యక్రమంలో సంస్థకు ఇండియాస్ ఫాస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ 2024–25 అవార్డు లభించింది.
ఈ పురస్కారాన్ని కంపెనీ సీఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గౌరవం తెనాలి డబుల్ హార్స్ కుటుంబానికి గర్వకారణమని, తమ ప్రతి వినియోగదారుడు, డిస్ట్రిబ్యూటర్, భాగస్వామి నమ్మకానికి నిదర్శనమని అన్నారు.