సీఎం జగనన్న తనకు ఇల్లు ఇచ్చాడంటూ సంతోషంగా చెప్పిన తెనాలికి గీతాంజలి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో అధికారులు గీతాంజలికి ఇంటిస్థలం పట్టా అందజేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ తో ఆమె మాట్లాడిన మాటలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనకు ఇల్లు వస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ గీతాంజలి సంబరపడిపోయింది.
ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన కొందరు అభిమానుల సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కు దిగారు. దానిని భరించలేకే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం గీతాంజలి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందంటూ చెబుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఆమె సంతోషం... అంతలోనే విషాదంగా మారటం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గీతాంజలి అసలు పేరు గీతాంజలి దేవి. తెనాలిలో నివాసం ఉంటుంది. ఆమె వయసు 29 ఏళ్లు. ఈమె భర్త బాలచంద్ర. బంగారం పని చేస్తుంటాడు. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే గీతాంజలికి సొంతిల్లు ఉండాలని ఎప్పటినుంచో కల.. ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది. ఇటీవల వైసీపీ సభలో ఆమె ఇంటిస్థలం పట్టాకు కూడా అందజేశారు. దీంతో తన కల నెరవేరుతోందంటూ ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడిన మాటాలు కొద్దీ గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో కొంతమంది ప్రతిపక్ష పార్టీకి చెందిన అభిమానులు గీతాంజాలి ఓ పెయిడ్ అర్టి్స్ట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ వచ్చారు. దీంతో దానిని భరించలేకే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు.