
- వచ్చే నెల 25 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి నల్గొండ జిల్లా వరకు 200 కిలోమీటర్ల వరకు నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) సౌత్ పార్ట్ ప్రాజెక్టు కన్సల్టెంట్ ఎంపికకు ఆర్ అండ్ బీ శుక్రవారం టెండర్లు పిలిచింది.
టెండర్ దక్కించుకునే కన్సల్టెంట్.. ప్రాజెక్టు రూట్ మ్యాప్ అలైన్ మెంట్ లో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తుంది. దీంతోపాటు ప్రాజెక్టుకు నిధులు ఎంత అవసరం, చెల్లింపులు ఎలా చేయాలి, ప్రాజెక్టు మేనేజ్ మెంట్ యూనిట్ వంటి అంశాలపై రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందని ఆర్ అండ్ బీ తన టెండర్ నోటిఫికేషన్ లో పేర్కొన్నది. టెండర్ దాఖలు చేసేందుకు వచ్చే నెల 25 వరకు గడువు విధించింది.