హైదరాబాద్లో డైలీ కేబీఆర్ పార్క్ మీదుగా వెళ్తుంటారా..? అయితే ఇది గుడ్ న్యూసే..!

హైదరాబాద్లో డైలీ కేబీఆర్ పార్క్ మీదుగా వెళ్తుంటారా..? అయితే ఇది గుడ్ న్యూసే..!

కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్ల నిర్మాణానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది జీహెచ్ఎంసీ. మొత్తం రూ.1090 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్యాకేజులుగా పనులు జరగనున్నాయి. కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఏడు స్టీల్ బ్రిడ్జి లు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఫిబ్రవరి 21 న నోటిఫికేషన్ విడుదల చేసింది.

హెచ్ సిటి ప్రాజెక్టుల్లో భాగంగా నగరంలో పలు చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నెల (ఫిబ్రవరి)  27 నుంచి మార్చ్ 24 వరకు బిడ్ వేసుకోవచ్చని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. మార్చ్ 10న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ప్రీ బిడ్ మీటింగ్ జరగనుంది. మార్చ్ 26 న బిడ్ ప్రైజ్ ఓపెనింగ్ ఉంటుంది. 

 

బిడ్లను స్వీకరించేందుకు చివరి తేది మార్చి 24. చివరి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్ లు స్వీకరించనున్నట్లు తెలిపారు. మిగతా వివరాల కోసం www.tender.telangana.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చు.