
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి సంబంధించి సోమవారం టెండర్లు నిర్వహించారు. ఇందులో తలనీలాలకు రూ.11లక్షల ఆదాయం వచ్చింది. ఈ టెండర్‌ను బొజ్జ యాదగిరి కైవసం చేసుకున్నాడు. గతేడాది కంటే రూ.2.93లక్షలు అదనంగా సమకూరినట్లు ఈవో తెలిపారు.
ఆలయం వద్ద కొబ్బరికాయల అమ్మకం, ఒడిబియ్యం పోగు చేసుకోవడం, ఆలయ ప్రాగణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకునేందుకు టెండర్ పాడగా గతేడాది కంటే తక్కువగా పలకడంతో వాటిని వాయిదా వేశారు. కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు, ఆలయం వద్ద పూజా సామగ్రి విక్రయించేందుకు వేలం వేయగా ఎవరూరాకపోవడంతో వీటిని కూడా వాయిదా వేశారు.
వీటికి త్వరలోనే మళ్లీ టెండర్లు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శివరాజు, ఈవో మోహన్ రెడ్డి, చైర్మన్ బాలాగౌడ్, ఆలయ సిబ్బంది, ధర్మకర్తలు, ఏడుపాయల ఔట్ పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.